నెలాఖరులోగా స్పందించకుంటే బొగ్గు సరఫరా నిలిపివేత: వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరిక
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్టడి విజయవంతం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణికి రావాల్సిన బకాయిలను విడుదల చేయడం ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు.. అది ప్రభుత్వ బాధ్యత అని సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ-ఎస్సీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారురూ. 59 వేల కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైంది. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, కార్మిక నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చి విద్యుత్ సౌధ ముట్టడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యూసఫ్, ప్రధాన కార్యదర్శి నరసింహ, వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.26 వేల కోట్లుగా ఉన్న బకాయిలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 59 వేల కోట్లకు చేరడం ఆందోళనకరమన్నారు. గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. వేల కోట్ల నిధులు పేరుకుపోవడం వల్ల సంస్థ ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఈ నెలాఖరులోగా బకాయిల చెల్లింపుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే జెన్కో, ట్రాన్స్‌కోలకు బొగ్గు సరఫరాను నిలిపివేసే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, సెంట్రల్ సెక్రటరీ వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు బాజీ సైదా, మోటపలుకుల రమేష్, ఎమ్మార్సీ రెడ్డి, రాంగోపాల్, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, సుధాకర్, నజీర్, రంగు శ్రీనివాస్, గంధం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.





ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ అండ్ పీసీ విభాగానికి సంబంధించిన నూతన బీఎంఎస్ పిట్ కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ బీఎంఎస్ యూనియన్ను మరింత బలోపేతం చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ బైరి హనుమాన్ గౌడ్‌కు నూతన కమిటీ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతన పిట్ సెక్రటరీతో పాటు కార్యవర్గ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ అండ్ పీసీ విభాగం పిట్ సెక్రటరీగా కొమ్మ బాపు (సీనియర్ సెక్యూరిటీ గార్డ్), అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా అష్టకాల శ్రీధర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అప్పాల రవీందర్ (సీనియర్ సెక్యూరిటీ గార్డ్) నియమితులయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా పబ్బతి మల్లేష్ (సీనియర్ సెక్యూరిటీ గార్డ్), ఆకుతోట బాలకృష్ణ, ఒడ్డె తిరుపతి, బొప్ప లక్ష్మణ్.. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మేరుగు శ్రీనివాస్, సుంకరి మొండి, జీకే స్వామి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెల్ల తిరుపతి, కనవెన సాగర్, బుర్ర అరుణ్ కుమార్ గౌడ్, గూడ శ్రీకాంత్, ఐలి శ్రీనివాస్, బొద్దుల ఫణికుమార్, సంగెం నర్సింహారావు, తీర్తాల సదానందం, దాసరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ అండ్ పీసీ నూతన బీఎంఎస్ కమిటీ నియామక పత్రాన్ని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ బైరి హనుమాన్ గౌడ్‌కు అందజేస్తున్న ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి తదితరులు.