ప్రజలు, ప్రయాణికుల మూడు దశాబ్దాల కల నెరవేరింది

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
సీసీసీ కార్నర్‌లో రూ. 20 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి భూమిపూజ

నస్పూర్, ఆర్.కె న్యూస్: నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన కూడలిలో ప్రజా సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలన్న స్థానికుల మూడు దశాబ్దాల కలను సాకారం చేశామని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద ప్రయాణికులు, వ్యాపారులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న ఆధునిక పబ్లిక్ టాయిలెట్స్ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. సీసీసీ కార్నర్ వద్ద మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రజలు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా సింగరేణి సీఎండీ, స్థానిక యాజమాన్యంతో మాట్లాడి, అడ్డంకిగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో తొలగింపజేసి ఈ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్, విద్యుత్ అధికారులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో తన సొంత డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక ప్రజలు, వ్యాపారులు, మహిళల హర్షం:

సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై స్థానిక వ్యాపారస్తులు, మహిళలు, ప్రయాణికులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. సుమారు 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ముఖ్యంగా బస్టాండ్ వద్ద వేచి ఉండే మహిళా ప్రయాణికులు, ఇక్కడి మహిళా చిరువ్యాపారుల అవస్థలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని తమ దీర్ఘకాలిక సమస్యను గుర్తించి పరిష్కరించినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మేయర్ ధర్ని మధుకర్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎంబడి కుమారస్వామి, తాళ్ల సంపత్ రెడ్డి, బండారి సుధాకర్, ఆర్. గోపాల్ రావు, అగ్గు సాగర్, తోట రజిత, ఖలీద్, శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఏఈ మధు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్‌చార్జ్‌లు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, స్థానిక వర్తక వ్యాపార సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment