నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో వెలసిన భూలక్ష్మి,
మహాలక్ష్మి, పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామ పెద్దలతో కలిసి ఉత్స వాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ దర్ని మధుకర్ అమ్మవార్లకు, పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… గ్రామ దేవతల కృపాకటాక్షాలతో సీతారాంపల్లి గ్రామస్తులతో పాటు మంచిర్యాల నగర ప్రజలందరూ సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా నిర్వహించే ఇలాంటి సాంప్రదాయ కొలుపులు ప్రజల మధ్య ఐక్యతను, ఆత్మీయతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
32







