కార్మిక హక్కుల పరిరక్షణ, సింగరేణి మనుగడకు ఏఐటీయూసీయే కొండంత అండ: ఏఐటీయూసీ నాయకులు

నస్పూర్ నరసయ్య భవన్‌లో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడంతో పాటు కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తోందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌కే బాజీ సైదా స్పష్టం చేశారు. నస్పూర్ పట్టణంలోని నరసయ్య భవన్ వద్ద శనివారం ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందికట్ల వీరభద్రయ్య హాజరుకాగా, బ్రాంచ్ సెక్రటరీ ఎస్‌కే బాజీ సైదా ఎర్రజెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవడం, కార్మిక సంక్షేమమే లక్ష్యంగా ‘సేవ్ సింగరేణి జాతా’, హెడ్ ఆఫీస్ ముట్టడి, జెన్‌కో ముట్టడి వంటి అనేక చరిత్రాత్మక ఉద్యమాలు నిర్వహించామని గుర్తుచేశారు. ఏఐటీయూసీ నిరంతర పోరాటాల ఫలితంగానే గుర్తింపు సంఘం హోదాలో కార్మికులకు ప్రయోజనం చేకూర్చే 24 కీలకమైన ఒప్పందాలను యాజమాన్యంతో కుదుర్చుకోగలిగామన్నారు. ముఖ్యంగా కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి పథకం, అలవెన్సులు/పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రద్దు వంటి అంశాలపై ఒప్పందాలు సాధించామని, వాటిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయించి కార్మికులకు లబ్ధి చేకూరేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అలాగే కార్మికుల ఐక్య పోరాటాల ద్వారానే నేడు సింగరేణిలో రికార్డు స్థాయిలో దీపావళి బోనస్, లాభాల వాటాను సాధించుకోగలిగామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసేవరకు జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాపాడటంతో పాటు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, ఏరియా సెక్రటరీ మూడ సుధాకర్, జిల్లా కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, అధికార ప్రతినిధి రాజ్‌కుమార్, పిట్ సెక్రటరీలు నర్సింగరావు, నాగేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ప్రతాప్, జీపీ రావు, నరేందర్, సాయిలు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment