బీసీ, ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటు జీఎం బి. కృష్ణ ప్రసాద్ బీసీ లైజన్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, బీసీ అండ్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం జీఎం కార్యాలయంలో ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ… పదోన్నతులు, సర్వీస్ సంబంధిత సమస్యలను యాజమాన్యం దృష్టికి తెస్తే పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు మస్కె సమ్మయ్య మాట్లాడుతూ, యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా మాట్లాడుతూ, ప్రమోషన్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శులు మారుతి, బద్రి బుచ్చయ్య, నాయకులు చంద్రమోహన్, మల్లేష్, రఘురాం, మహేష్, రవీందర్, ఏరియా ఇంజనీర్ సురేష్, హనుమాన్ గౌడ్, పిట్ కార్యదర్శులు మనోజ్, రాజ్ కుమార్, భీమన్న, సిద్ధం అజయ్, తిరుపతి, పవన్, సాంబయ్య, కుమారస్వామి, సురేష్, సత్యం, సందీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.





మహాలక్ష్మి, పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామ పెద్దలతో కలిసి ఉత్స వాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ దర్ని మధుకర్ అమ్మవార్లకు, పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… గ్రామ దేవతల కృపాకటాక్షాలతో సీతారాంపల్లి గ్రామస్తులతో పాటు మంచిర్యాల నగర ప్రజలందరూ సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా నిర్వహించే ఇలాంటి సాంప్రదాయ కొలుపులు ప్రజల మధ్య ఐక్యతను, ఆత్మీయతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.