నస్పూర్, ఆర్.కె న్యూస్: నిరంతరం నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న ఓ రౌడీషీటర్‌పై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల డీసీపీ, ఏసీపీల ఆదేశాలతో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (20)కి నగర బహిష్కరణ నోటీసు జారీ చేసినట్లు శ్రీరాంపూర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల అశోక్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… జలంపల్లి నాగేష్ కుమారుడైన సందీప్ 2023 సంవత్సరం నుంచి 2026 వరకు వరుసగా నేర, రౌడీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే రౌడీషీట్ ఉన్నప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకుండా స్థానికంగా గొడవలు, అల్లర్లు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా 2026 సంవత్సరంలోనే వరుసగా మూడు నేరాలకు పాల్పడటంతో స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. సాధారణ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఇతని వల్ల ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన ఉన్నతాధికారులు, సందీప్ నేర చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ ఆకుల అశోక్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
32







