మార్కులే జీవితం కాదు.. ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలి

విద్యార్థినులకు దిశానిర్దేశం చేసిన సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్
సోషల్ వెల్ఫేర్ ఉమెన్ డిగ్రీ కాలేజీలో వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు..

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పరీక్షలంటే భయపడకుండా వాటిని మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే చక్కటి అవకాశంగా భావించి ఆత్మవిశ్వాసంతో రాయాలి” అని వనితా వాక్కు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్, సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ విద్యార్థినులకు సూచించారు. ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా మంచిర్యాల కాలేజీ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ ఉమెన్ డిగ్రీ కాలేజీలో వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రంగు వేణు కుమార్ మాట్లాడుతూ.. మనసులో ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి, “నావల్ల కాదు” అనే భావన స్థానంలో “నేను సాధించగలను” అనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవాలన్నారు. పరీక్షల్లో విజయానికి సరైన ప్రణాళిక, సమయపాలన, పునశ్చరణ (రివిజన్)తో పాటు తగినంత నిద్ర, పౌష్టికాహారం ఎంతో అవసరమని వివరించారు. “మార్కులు ముఖ్యం.. కానీ మార్కులే జీవితం కాదు. వైఫల్యం అంతం కాదు.. అది విజయానికి మరో మెట్టు మాత్రమేనని పేర్కొంటూ, తక్కువ మార్కులు వచ్చినా నిరాశ చెందకుండా తప్పులను సరిదిద్దుకుని పట్టుదలతో ముందుకు సాగాలని ప్రేరణ కల్పించారు. ప్రతి విద్యార్థిని తన జీవితానికి తానే శిల్పి అని, క్రమశిక్షణ, కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందేలా డీప్ బ్రీతింగ్, గైడెడ్ విజువలైజేషన్ వంటి మానసిక వ్యాయామాలను చేయించారు. చివరగా విద్యార్థినులతో “ఐ క్యాన్ – ఐ విల్ – ఐ మస్ట్ (I CAN – I WILL – I MUST)” అంటూ ఆత్మవిశ్వాస ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వనితా వాక్కు ఫౌండేషన్ కో-ఫౌండర్ తాళ్లపల్లి కవిత, డాక్టర్ అన్నపూర్ణ, జోష్ణ చంద్రదత్, కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment