ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు

నస్పూర్, ఆర్.కె న్యూస్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా శాఖ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గత 30 రోజులుగా ఉద్యోగులు శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పారపు సారయ్య మాట్లాడుతూ… ఉద్యోగుల హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ న్యాయమైన పోరాటానికి తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు హారిక రావు, రాష్ట్ర మహిళా నాయకురాలు నిషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాచకొండ సురేష్, లెనిన్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్య, అధికార ప్రతినిధి శ్రీవాణి, కాసిపేట మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు జహీర్ ఖాన్, రజిత, రాజశేఖర్, ప్రశాంత్, జ్యోతి, వసంత తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment