కల్వకుంట్ల కవిత అరెస్టు తీరు అత్యంత అభ్యంతరకరం

  • రియాజ్ అహ్మద్, ఉదారి చంద్రమోహన్ గౌడ్
  • ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్
  • ఈనెల 20 లోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు హెచ్చరిక

నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ పోరాటం చేపట్టిన తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఒక మహిళా నాయకురాలు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని, ఈ క్రమంలో పలువురు ఉద్యమకారులకు గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ తెలంగాణ ద్రోహులకు సీట్లు, పదవులు ఇస్తోందని ఆరోపించారు. ఉప్పల్‌లో కవిత చేపట్టిన భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారీగా ఒకటయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ కలిసి కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారని రియాజ్ అహ్మద్, చంద్రమోహన్ గౌడ్ ఆరోపించారు. కవిత చేపట్టిన ‘బాయిబాట’ కార్యక్రమానికి పోటీగా హరీష్ రావు సింగరేణి పర్యటనలు పెట్టుకున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గాయని, వందల కోట్ల సింగరేణి నిధులను హరీష్ రావు, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గాలకు మళ్లించుకున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులు చేపట్టిన సకల జనుల సమ్మెతోనే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని, రాష్ట్ర ఏర్పాటులో కార్మికుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో కొత్త గనులు, ప్రాజెక్టులు ప్రారంభించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంపూర్ణ మద్దతు కల్వకుంట్ల కవితకు ఉందని, భవిష్యత్తులో ఆమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీలోపు మెడికల్ బోర్డు నిర్వహించకపోతే హెచ్ఎంఎస్, టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఎస్‌ఆర్‌పీ 3 ప్రమాదంపై నిష్పక్షపాత విచారణ జరపాలి
గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3 గనిలో జరిగిన ప్రమాదం సైడ్ ఫాల్ కాదని, అది ముమ్మాటికీ రూఫ్ ఫాల్ (పైకప్పు కూలడం) ప్రమాదమేనని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి యాజమాన్యం గనుల్లో జరుగుతున్న పలు ప్రమాదాల వివరాలను బయటకు రాకుండా దాస్తోందని ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన అధికారులను తక్షణమే బదిలీ చేసి, నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు ఏసీ గదుల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలోకి వచ్చి గనులను సందర్శించి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వి. అనిల్ రెడ్డి, నాయకులు ఎర్రం శెట్టి సాయి కుమార్, తుల అనిల్ కుమార్, కాసర్ల అశోక్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోరకొప్పుల మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాసకొండ సురేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు హారికరావు, ఉమ్మడి ఆదిలాబాద్ మీడియా ఇంచార్జి వేముల సాయి కుమార్ గౌడ్, నాయకులు రామ్మోహన్ చారి, జహీర్ ఖాన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment