ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
KYATHAM RAJESH
రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం
శ్రీరాంపూర్ ‘చాయ్ పే చర్చ’లో బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరెడ్లశ్రీనివాస్
భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం
పోటెత్తిన భక్తులు.. 21 జంటలతో సత్యనారాయణ సామూహిక వ్రతాలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన వెలసిన చారిత్రక ప్రసిద్ధ గౌతమేశ్వరాలయం గురువారం శివనామస్మరణతో మార్మోగింది. పవిత్రమైన గురువారం కావడంతో ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 21 జంటలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పూజలు చేశారు. గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడినట్లుగా పురాణ ప్రశస్తి కలిగిన ఈ ఆలయంలో, పార్వతీదేవి, నందీశ్వరుడు, వినాయకుడితో కొలువైన గౌతమేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వుత్తూరి దివ్య – రవీందర్ దంపతులు తమ కుమార్తె ‘శాన్విత’ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. పూర్ణిమ, ఏకాదశి, మరియు గురువారం వంటి పర్వదినాల్లో ఇక్కడ వ్రతాలు, అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది
బాధితుడికి అండగా నిలిచిన వైద్యులు, తోటి ఉద్యోగులు
రామకృష్ణాపూర్, ఆర్.కె న్యూస్: తోటి ఉద్యోగి కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాకేష్ ఇటీవల తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, వార్డ్ అసిస్టెంట్లు, ఆయాలు, కార్యాలయ సిబ్బంది మరియు కాంట్రాక్టు ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు సేకరించారు. మొత్తం రూ. 52,200 విరాళాన్ని సిబ్బంది సమీకరించగా, అందులో కుటుంబ అత్యవసరాల నిమిత్తం రూ. 27,200 నగదును గురువారం డిప్యూటీ సీఎంవో (అడ్మిన్) ఎం. మధు కుమార్ చేతుల మీదుగా రాకేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మిగిలిన రూ. 25,000 మొత్తాన్ని రాకేష్ కోలుకునే సమయంలో అవసరాల కోసం వచ్చే నెలలో రెండో దఫాగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంవో మధు కుమార్ మాట్లాడుతూ.. ఏరియా ఆసుపత్రి సిబ్బంది కేవలం వైద్య సేవల్లోనే కాకుండా, సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవడంలోనూ ముందుంటారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని సిబ్బందిని అభినందించారు. మేకల రాజయ్య, సిరికొండ నాగేంద్ర భట్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్రన్ విజయలక్ష్మి, ఆఫీసు సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండి మదర్ సాహెబ్, ఇతర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ఎస్ కె బాజీ సైదా
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో రక్షణ చర్యలు కరువయ్యాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కందికట్ల వీరభద్రయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రెటరీ ఎస్.కె బాజీ సైదా ఆరోపించారు. గురువారం వారు ఆర్.కె 7 గనిని సందర్శించి, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గనిలో రక్షణ అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ప్రమాదంలో ఎస్డిఎల్ బండి కేబుల్ తాకి శ్రీనివాస్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఒకే లెవల్లో రెండు ఎస్డిఎల్ యంత్రాలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇది పూర్తిగా యాజమాన్య వైఫల్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి, గనిలో రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ కార్మికులను సర్ఫేస్పై విధుల్లో వాడుకుంటూ, ఇప్పుడు వారి అండర్ గ్రౌండ్ అలవెన్సులను రికవరీ చేయడం దారుణమని అన్నారు. కార్మికుల వేతనాల నుంచి చేస్తున్న రికవరీలు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో యాజమాన్యంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, ఏరియా సెక్రటరీ సంపత్, పిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, నాయకులు శంకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జీరో పెండెన్సీ లక్ష్యంగా ‘ప్రయాస్’.. శ్రీరాంపూర్ ఏరియాకు 1332 రివైజ్డ్ పీపీఓలు
సీఎంపీఎఫ్ అధికారులు మా వద్దకు రావడం శుభపరిణామం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ‘జీరో పెండెన్సీ’ సాధించడమే లక్ష్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ‘ప్రయాస్-4’ సమావేశం జరిగింది. గురువారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్-2 గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ గోవర్ధన్, శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన 1332 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) కాపీలను జీఎం మునిగంటి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్ల కోసం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్ విధానంలో పెండింగ్ దరఖాస్తులను జీరో స్థాయికి తేవడమే ‘ప్రయాస్’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏరియా పరిధిలోని పెండింగ్ క్లేయిమ్స్‌ను సమీక్షించి, వాటిలో ఉన్న లోపాలను సవరించి వెంటనే పరిష్కరించాలని సంక్షేమ అధికారులకు సూచించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారం చాలా జటిలంగా ఉండేదని, అధికారులను సంప్రదించడం కూడా క్లిష్టంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం సీఎంపీఎఫ్ అధికారులే నేరుగా మన వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామం అని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ అధికారులు, సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లోనూ జీరో పెండెన్సీ లక్ష్యంగా మరిన్ని ప్రయాస్ మీటింగ్‌లు నిర్వహిస్తామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి సందీప్, వివిధ గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జీఎం శ్రీనివాస్
కేరళ గురుస్వామిచే ప్రత్యేక పూజలు
నస్పూర్ , ఆర్.కె న్యూస్: లోక కళ్యాణార్థం శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 8న అయ్యప్ప స్వాముల మహా సంగమం, మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్, సంఘం అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివ కుమార్, ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశం మాట్లాడుతూ.. ఈ నెల 8న సాయంత్రం 6 గంటలకు కేరళకు చెందిన ప్రముఖ గురుస్వామి బ్రహ్మశ్రీ సంజీవ నంభూద్రి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి మహా మండల పడిపూజ, అనంతరం అయ్యప్ప స్వాములచే అగ్ని ప్రవేశం (అగ్ని గుండాలు) కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆర్కే-8 కాలనీలోని విఘ్నేశ్వర ఆలయం నుండి భారీ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో 108 మంది మహిళలు హారతులతో, అయ్యప్ప భక్తుల పేటతుల్లి నృత్యాలు, నగర సంకీర్తనలతో.. అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ యాత్ర ఆర్కే-6 గుడిసెలు, గాంధీనగర్, హిమ్మత్ నగర్ మీదుగా ప్రగతి స్టేడియం వరకు సాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు అయ్యప్ప స్వాములు, భక్తులకు భిక్షా (అన్నదానం) కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జిల్లా స్థాయి మహా సంగమానికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని సిరివంచ నుండి కూడా వేలాదిగా అయ్యప్ప స్వాములు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు చకిలం శ్రావణ్ చింటు, కార్యదర్శి పడాల లింగయ్య, దాసరి నవీన్, జమాల్ పూర్ శ్రావణ్, తళాల శివ, ఆనకారి హరీష్, ప్రసాద్, నాతాడి కొండాల్ రెడ్డి, దాసరి కళ్యాణ్, తాటిపాముల సత్యనారాయణ, జక్కెన రమేష్, ఎగ్గడి వినోద్ కుమార్, మాటూరి వంశీ, ఆడేటి అశోక్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జీఎం (పర్సనల్, ఐ.ఆర్ అండ్ పి.ఎం) కవితా నాయుడు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో కారుణ్య, వారసత్వ ఉద్యోగ నియామకాలను మరింత పారదర్శకంగా, వేగంగా చేపట్టేందుకు నూతనంగా ‘ప్రీ-హైరింగ్ అప్లికేషన్’ (టీ-కోడ్: వై-ఎంప్లాయ్) ను రూపొందించినట్లు జనరల్ మేనేజర్ (పర్సనల్, ఐ.ఆర్ అండ్ పి.ఎం) కవితా నాయుడు తెలిపారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి సిబ్బంది విభాగం (పర్సనల్) అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం కవితా నాయుడు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలను నిర్వహించడానికి రూపొందించిన ఈ డిజిటల్ అప్లికేషన్ ద్వారా క్షేత్ర స్థాయిలో దరఖాస్తులు స్వీకరించడం నుండి సాప్ హెచ్.ఆర్ బృందం ద్వారా తుది నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రక్రియ అంతా సులభతరం అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా వివరాల నమోదు, పరిశీలన, నియామక స్థానం కేటాయింపు వంటి అన్ని దశల్లో పారదర్శకత ఉంటుందని, కాలయాపన లేకుండా సకాలంలో పనులు పూర్తవుతాయని, పత్రాల నిర్వహణ ప్రామాణికంగా ఉంటుందని పేర్కొన్నారు. మాజీ ఉద్యోగి వివరాల నమోదు, ధృవీకరణ, ప్రాథమిక వైద్య పరీక్ష, పుట్టిన తేదీ నిర్ధారణ, ఓ.ఎస్.ఎల్ వివరాలు పంపడం, ఓ.ఎస్.ఎల్ చేరిక, పోస్టింగ్ వివరాలు, విధుల్లో చేరే ప్రక్రియ, హెచ్.ఆర్ సమీక్ష, తుది నియామకం.. ఇలా అన్ని దశలు ఈ యాప్ ద్వారానే జరుగుతాయని వివరించారు. అలాగే, ఒప్పంద కార్మికుల ఈ.ఎస్.ఐ వివరాల నమోదు ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డిప్యూటీ పి.ఎం.లు ఎం. రాజేష్, జి.కె. కిరణ్ కుమార్, సీనియర్ పి.ఓ.లు ఎస్. సురేందర్, బి. మురళీ, ప్రశాంత్, సంక్షేమ అధికారులు, వివిధ గనుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే పంపులు తొలగించారు
-
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికుల కాలనీలకు, మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలకు గోదావరి రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నాడు టీబీజీకేఎస్ నాయకులు శ్రీరాంపూర్ లోని గోదావరి ఇంటెక్ వెల్, పంప్ హౌస్ లను సందర్శించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి శ్రీరాంపూర్, ఆర్.కె 8, ఆర్.కె 6 కాలనీలు, గాంధీనగర్, కృష్ణ కాలనీ, ఆర్.కె 6 గుడిసెలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నస్పూర్, గోదావరి కాలనీ, నాగార్జున కాలనీ, సిసిసి టౌన్ షిప్ లలో కూడా ఇదే దుస్థితి నెలకొందని తెలిపారు. డిసెంబర్ నెలలోనే నీటి ఎద్దడి తలెత్తడం యాజమాన్య వైఫల్యానికి నిదర్శనమన్నారు. సివిల్ డిపార్ట్మెంట్లో పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే యాజమాన్యం ఇంటెక్ వెల్ ను బంద్ చేసి, మోటార్లను తొలగించిందని ఆరోపించారు. గోదావరి పంప్ హౌస్ లో 190 హెచ్ పి సామర్థ్యం గల ఆరు పంపులు ఉండగా, కేవలం రెండు పంపులతో నీటిని తోడటం వల్లే నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. యాజమాన్యం సీఎస్ఆర్, డీ.ఎం.ఎఫ్.టి నిధుల ద్వారా సింగరేణికి సంబంధం లేని పనులకు, యూనివర్సిటీలకు, ఫర్నిచర్ కి కోట్లు ఖర్చు చేస్తోందని, కానీ సొంత కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. సంక్షేమం పేరుతో ఎల్ఈడి స్క్రీన్ లు , కరపత్రాల ప్రచారానికే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. తక్షణమే గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని, గతంలో కోట్లు వెచ్చించి నిర్మించిన ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సివిల్ డిపార్ట్మెంట్లో సిబ్బందిని పెంచి, భవిష్యత్తులో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్, కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఏరియా కార్యదర్శి గడ్డం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- సింగరేణి క్వాలిటీ షీల్డ్ దక్కించుకున్న శ్రీరాంపూర్ ఏరియా
- ఈ ఏడాది ఇప్పటి వరకు 80 శాతం బొగ్గు ఉత్పత్తి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు నాణ్యతలో శ్రీరాంపూర్ ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. 75 శాతం క్వాలిటీని సాధించి, ఇటీవల జరిగిన నాణ్యత వారోత్సవాల ముగింపులో సీఎండీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక షీల్డ్ ను అందుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఏరియా ప్రగతిని ఆయన వివరించారు. నవంబర్ నెలకు గాను 5,88,800 టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఉండగా, 3,43,410 టన్నులు (58 శాతం) సాధించామని జీఎం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (నవంబర్ 30 నాటికి) 42.41 లక్షల టన్నుల లక్ష్యానికి గాను.. 33.75 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ముఖ్యంగా ఆర్కే న్యూ టెక్ గని 113 శాతంతో రికార్డు సృష్టించిందని అభినందించారు. గత నెలలో ఉత్పత్తిని పెంచే చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో రూ. 5 కోట్ల 26 లక్షల విలువైన 75 టన్నుల భారీ హైడ్రాలిక్ క్రేన్‌ను, అలాగే సెక్యూరిటీ విభాగం కోసం రూ. 15 లక్షలతో నిర్మించిన నూతన కార్యాలయ సముదాయాన్ని (ఆఫీస్, రెస్ట్ రూమ్స్) ప్రారంభించినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ఇప్పటి వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా 4,333 మంది దరఖాస్తు చేసుకోగా.. అర్హులైన 3,791 మంది వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని చెప్పారు. మరో 275 మందికి రూ. 25 లక్షల చొప్పున లంసమ్ మొత్తం చెల్లించామని, 20 మందికి ఎంఎంసీ (నెలవారీ పెన్షన్) కింద రూ. 39,069 అందిస్తున్నామని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల్లో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు కనీసం 150 మస్టర్లు (హాజరు) లేని ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. అలాగే జీఎం కార్యాలయంలోని మహిళా ఉద్యోగులకు షీ టీం సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈఎస్ఐ ఒప్పంద కార్మికుల నమోదు, అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6 గనుల్లో ‘5 స్టార్ రేటింగ్’ కోసం బెల్లంపల్లి, రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంలు, శ్రీరాంపూర్ జీఎం కలిసి ఇన్స్పెక్షన్ నిర్వహించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.



