🟢 పుట్ట యశోద గెలుపుకు కొక్కిరాల సురేఖ పిలుపు
🟥 చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రెండో డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. పార్టీ అభ్యర్థి పుట్ట యశోద తరపున జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని సురేఖ పేర్కొన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అభ్యర్థి పుట్ట యశోదకు మద్దతుగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



