సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో సోమవారం భీమన్న పండుగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భీమన్న గజాలను సోన్ గోదావరి నదికి గంగ స్నానానికి ఘనంగా సాగనంపారు. ఆలయంలోని గజాలను గ్రామంలో బాజాభజంత్రీల మధ్య ఊరేగింపు నిర్వహించిన అనంతరం గంగస్నానానికి తరలించారు. సోమవారం వేకువ జామున ఆలయ ప్రవేశం చేయడం ద్వారా జాతర ప్రారంభమవుతుందని గ్రామ సర్పంచ్ గుర్రం రాము, ముదిరాజ్ కులస్తులు తెలిపారు.
8







