కాకతీయ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

37వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఖలీద్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్ కాకతీయ కాలనీలో కార్పొరేషన్ నిధులు రూ. 6 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఖలీద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహమ్మద్ ఖలీద్ మాట్లాడుతూ… డివిజన్ పరిధిలోని కాలనీలలో ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, డివిజన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమల రావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ధోన్పల్లి లింగన్న, డివిజన్ అధ్యక్షుడు అరిగెల ప్రేమ్ సాగర్ రావు, గూడెం దేవస్థానం డైరెక్టర్ వెంకటరమణ, జిల్లా నాయకుడు నౌండ్ల ప్రసాద్, మైనార్టీ నేతలు మహమ్మద్ జావిద్, మల్క ప్రభాకర్, తిరుపతి రెడ్డి, సాయి కిరణ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు మహమ్మద్ అత్తిక్ మరియు స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment