అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ ధర్ని మధుకర్–సుజాత దంపతులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో గల శ్రీ వీరాంజనేయ స్వామి
దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, ఆయన సతీమణి ధర్ని సుజాతతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమ క్రతువులో పాల్గొన్న అనంతరం, దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ… లోకమాత దుర్గాదేవి చల్లని ఆశీస్సులతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నిరంతరం ప్రజాసేవలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, భవానీ యూత్ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








