పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండ

⬛ చెక్కులను పంపిణీ చేసిన కూచాడి శ్రీహరి రావు

సోన్, ఆర్.కె న్యూస్: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. మంగళవారం నిర్మల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో సోన్ మండలంలోని 22 లబ్ది దారులకు 7 లక్షల 69 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అతి తక్కువ సమయంలోనే సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గడపకూ చేరవేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమ కష్టకాలంలో ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సహకరించిన శ్రీహరి రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొయినుద్దీన్, మాజీ అధ్యక్షుడు మధుకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ వినోద్, అజహర్, అల్లూరి రాజారెడ్డి, రమేష్ రెడ్డి, కుమ్మరి లింగన్న, బండి లింగన్న, అర్జం లింగన్న, గడ్డం స్వామి, బొడ్డు లక్ష్మణ్, చింతకింది గంగాధర్, క్రియాశీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment