నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్‌లో అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యుడు, నస్పూర్ పట్టణ ఇంచార్జి నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి-లింగయ్య పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించి, మరణించిన రెండు కుటుంబాలకు ఎమ్మెల్యే అందించిన రూ. 5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
6







