హనుమాన్ భక్తులకు మజ్జిగ, పండ్ల పంపిణీ

వీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నస్పూర్‌లో సేవా కార్యక్రమాలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్ మండలంలోని పలు హనుమాన్ దేవాలయాల వద్ద భక్తులకు, పాదచారులకు మజ్జిగ, అరటిపండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు వూట్కూరి నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా వీఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లెతుల రాజేంద్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జయంతి వేడుకల కోసం ఆలయాలకు తరలివచ్చిన భక్తులకు, పాదచారులకు చల్లని మజ్జిగ అందించి సేదతీర్చారు. సామాజిక సేవలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ శ్యామసుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దండ రామకృష్ణ రెడ్డి, సభ్యులు రేగండ్ల ఉపేందర్, కమృద్దీన్, శ్రవణ్, గోపతి తిరుపతి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment