సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు సంబంధించిన 119 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసుకోవాలని, గత ప్రభుత్వంలో ఇండ్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారని, ఇంకా ఎవరికైతే పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదో, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, తాసిల్దార్ సంతోష్ కుమార్,ఎంపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
9







