మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాలలో 375 మంది ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసిన 375 మంది ముస్లిం మహిళలకు అధికారులతో కలిసి ఆమె కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ల సహకారం నిరుపేద మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమెను మైనారిటీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఖలీద్‌తో పాటు పలువురు ముస్లిం మహిళలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, లక్సెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, లక్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.








