నస్పూర్‌లో ఘనంగా వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన మంచిర్యాలలోని
శ్రీనివాస గార్డెన్స్‌లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల వాల్‌పోస్టర్‌ను ఆదివారం నస్పూర్ మండల కేంద్రంలోని ఎస్పీ గ్రాండియర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి మహిళా సంఘం అధ్యక్షురాలు గోనే మణిమాల రెడ్డి, మేకల వనజా రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 14న శ్రీనివాస గార్డెన్స్‌లో అట్టహాసంగా జరిగే బతుకమ్మ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంబరాల్లో భాగంగా చక్కగా తీర్చిదిద్దిన ఉత్తమ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. అలాగే హాజరయ్యే మహిళలందరికీ అల్పాహార వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోతే రాఘవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు పుప్పిరెడ్డి బాపురెడ్డి, కోశాధికారి చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మూల విష్ణువర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, ఆళ్ల రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









