నూతన గృహాలను ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ఇందిరమ్మ ఇళ్లు” పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ, 32వ డివిజన్లలో నిర్మించుకున్న నూతన గృహాల ప్రారంభోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ నూతన గృహాలను ప్రారంభించారు. 18వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులు చిలుకూరు కీర్తన – సంతోష్ దంపతులు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ దర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ రాచమళ్ళ కమల శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్య, వార్డు ఆఫీసర్ కుమార్, మంచిర్యాల జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఒడ్డె రాజమౌళి, హాజీపూర్ మండల యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఆడెపు రమేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారిశెట్టి సంతోష్, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
32వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
అలాగే మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో 32వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులు మర్రి రాజమణి – సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కూడా మేయర్ దర్ని మధుకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపతి తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పిట్టల రవి, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాలలో మేయర్ ధర్ని మధుకర్ లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్, కార్పొరేటర్లను లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ రెండు డివిజన్లలో జరిగిన వేడుకలకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.







