ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా సమస్యల పరిష్కారంలో యాజమాన్యం జాప్యం సిగ్గుచేటు

పెండింగ్ డిమాండ్లపై తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఐఎన్‌టీయూసీ డిమాండ్

యాజమాన్య వైఖరిపై బి. జనక్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ, సింగరేణి యాజమాన్యం అమలులో జాప్యం చేయడం సిగ్గుచేటు అని ఐఎన్‌టీయూసీ నాయకుడు బి. జనక్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. గురువారం పిట్ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డా. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన 234 మంది అర్హులైన అభ్యర్థులకు తక్షణమే కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి ఎగ్జిక్యూటివ్‌లు, కోల్ ఇండియా ఉద్యోగులకు వర్తిస్తున్న తరహాలోనే ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు కూడా పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించాలన్నారు. గతంలో ప్రకటించిన మేరకు ఓవర్‌మన్‌ల ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, ఉద్యోగుల సర్వీస్ రికార్డుల్లోని అలియాస్ పేర్లు, పేర్ల వ్యత్యాసాల పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్న అర్హులైన కార్మికులకు అన్‌ఫిట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిస్మిస్ అయిన కార్మికులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా మరో అవకాశం కల్పించాలని ఐఎన్‌టీయూసీ కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కానీ యాజమాన్యం మాత్రం కంటి తుడుపు చర్యగా లోపభూయిష్ట సర్క్యులర్ జారీ చేసిందని మండిపడ్డారు. ఆ సర్క్యులర్‌లోని లోపాలను సవరించి అర్హులందరికీ న్యాయం జరిగేలా సమగ్ర ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ సమ్మయ్య, జనరల్ సెక్రటరీ జీవన్ జోయల్, నాయకులు ల్యాగల శ్రీనివాస్, చాట్ల అశోక్, శీలం చిన్నయ్య, ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment