ఈనెల 15 నుంచి కవిత బాయిబాట

ఆరు రోజుల పాటు సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యటన

నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటించనున్నారు. బాయిబాట పేరుతో నిర్వహించే ఈ పర్యటనలో భాగంగా ఆమె అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. మొదటి విడత కార్యాచరణలో భాగంగా ఆరు రోజుల పాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వివిధ బొగ్గు గనుల ప్రాంతాల్లో ఈ పర్యటన కొనసాగనుంది. పర్యటన ప్రణాళిక ప్రకారం ఈనెల 15న చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి ఏరియా బొగ్గు గనుల ప్రాంతంలో కవిత పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న అదే నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియాలో కార్మికులతో సమావేశమవుతారు. 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియాలో పర్యటన ఉంటుంది. చివరి రోజు ఈనెల 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులను కలిసి సమస్యలను తెలుసుకోనున్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment