నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇటీవల గుడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ మరియు 31వ డివిజన్లకు చెందిన యువకుల కుటుంబాలను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదుకున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు శనివారం టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్ఛార్జి నూకల రమేష్, 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, 3వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మృతుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే పంపిన ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేశారు. కష్టకాలంలో ఉన్న ఆయా కుటుంబాలకు ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎల్లప్పుడూ అండగా ఉంటారని నాయకులు భరోసా ఇచ్చారు.
24







