అమ్మవార్ల ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
సీతారాంపల్లిలో భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల చల్లని ఆశీస్సులతో సీతారాంపల్లి గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషంగా వర్ధిల్లాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆకాంక్షించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు, జాతరలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు, తెలంగాణ గ్రామీణ సంస్కృతిని భావితరాలకు సజీవంగా అందించడంలో గ్రామ దేవతల కొలుపులు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవార్ల రక్ష ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు, ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు-సురేఖ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment