ఆటోలో మరిచిపోయిన 20 గ్రాముల బంగారు నెక్లెస్ రికవరీ

బాధితురాలికి అందజేసిన సీసీసీ నస్పూర్ పోలీసులు

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఆటోలో మరిచిపోయిన 20 గ్రాముల బంగారు నెక్లెస్, సెల్‌ఫోన్‌తో కూడిన పర్సును సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించి సీసీసీ నస్పూర్ పోలీసులు బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. నస్పూర్ మల్లికార్జున నగర్‌కు చెందిన బలసంకుల మంగ అక్టోబర్ 29న కోదండ రామాలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తూ, నస్పూర్ గేట్ వద్ద దిగే క్రమంలో ఆటోలో తన పర్సును మరిచిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. తహసీనుద్దీన్ పర్యవేక్షణలో ఎస్సై టి. జితేందర్ సింగ్, కానిస్టేబుల్ పి. వెంకటసాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను ట్రేస్ చేసి పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాధితురాలికి బంగారు నెక్లెస్, మొబైల్‌ను అప్పగించారు. వేగంగా స్పందించి సొత్తును రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని మంచిర్యాల రూరల్ సీఐ జి. రవీందర్ అభినందించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment