7వ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు
పూజల్లో పాల్గొన్న శ్రీపతి కల్పన–రాములు గౌడ్ దంపతులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్‌లో కొలువుదీరిన విజయ గణపతి సన్నిధిలో
వినాయక చవితి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయ గణపతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద నిత్య పూజలతో పాటు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీపతి కల్పనా–రాములు గౌడ్ దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. గణనాథుని కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.







