కొత్త పెన్షన్ చట్టం వద్దు.. పాత విధానమే ముద్దు

మంచిర్యాల కలెక్టరేట్ వద్ద విశ్రాంత ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన

నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025ను నిరసిస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (టీఎస్జీఆర్ఈఏ) ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్రాంత ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ దేశ్‌పాండేకు అందజేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దూస కృష్ణ, బెజ్జంకి జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పెన్షన్ వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఈ చట్టం వల్ల దేశంలోని 92 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, లక్షలాది మంది కేంద్ర పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 25ను బ్లాక్ డేగా పాటిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. పెన్షనర్ల అస్తిత్వానికే ముప్పు తెచ్చే ఈ ఆర్థిక సంస్కరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, అది విశ్రాంత ఉద్యోగుల జీవన హక్కు అని వారు గుర్తు చేశారు. స్వర్గీయ డి.ఎస్. నకారే పోరాట ఫలితంగా లభించిన పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కొత్త నిబంధనలు పెన్షనర్లకు ఆర్థికంగా, మానసిక వేదన కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛనుదారులను రెండు వర్గాలుగా విడగొట్టే కుట్రలను సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.పాపారావు, కే.నాగేశ్వర్, బి.సత్యనారాయణ, బి.తిరుపతి, ఎల్.ప్రేమ్ కుమార్, కైలాసం, కే.మల్లయ్య, కే.వైకుంఠం, బి.రాజమౌళి, రాష్ట్ర బాధ్యులు ఏ.రాంరెడ్డి, గుండేటి యోగేశ్వర్, మంచిర్యాల యూనిట్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, కైరం జనార్దన్ తో పాటు పెద్ద సంఖ్యలో పింఛనుదారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment