వచ్చే ఆర్థిక సంవత్సర లక్ష్యాల సాధనకు సన్నద్ధం కావాలి

  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • ఉత్పత్తి, ఓఎంఎస్ లక్ష్యాలపై సమీక్ష

నస్పూర్, ఆర్.కె న్యూస్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో లోటుపాట్లు పునరావృతం కాకుండా మంచి ఓఎంఎస్ తో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేలా అధికారులు సిద్ధం కావాలి” అని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం శ్రీరాంపూర్ సింగరేణి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏరియా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో అన్ని భూగర్భ గనులు, ఓపెన్ కాస్టుల్లో సాధించిన ఉత్పత్తి, ఓఎంఎస్ పనితీరును విశ్లేషించారు. రాబోవు కాలానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గడిచిన ఏడాది సాధించిన ఫలితాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఐఈడీ విభాగం అందించిన గణాంకాలను బేరీజు వేశారు. గనుల వారీగా కేటాయించిన లక్ష్యాలు, వాస్తవంగా వచ్చిన ఉత్పత్తి శాతాలను పరిశీలించారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన ఓఎంఎస్ నమోదవుతుందా లేదా అనే అంశంపై అధికారులను ఆరాతీశారు. వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. గనుల వారీగా ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై మునిగంటి శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. గనులకు అవసరమైన పనిముట్లు, యంత్రాల వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఉత్పత్తి పెంచడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణా రావు, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, డీజీఎం (ఐఈడీ) రాజన్న, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్సార్పీ ఓసీ పీఓ చిప్ప వెంకటేశ్వర్లు, ఆర్.కె 7 గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, ఆర్.కె 5 గ్రూప్ ఏజెంట్ ఎన్. శ్రీధర్, మేనేజర్ (క్వాలిటీ) వెంకటేశ్వర్ రెడ్డి తో పాటు వివిధ విభాగాల అధిపతులు, గనుల మేనేజర్లు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment