క్రీడల నిర్వహణలో శ్రీరాంపూర్ మేటి: జీఎం మునిగంటి శ్రీనివాస్

సింగరేణి కంపెనీ స్థాయి బ్యాడ్మింటన్, టీటీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఎంత పెద్ద క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు అయినా సమర్థవంతంగా నిర్వహించే సత్తా, మౌలిక వసతులు శ్రీరాంపూర్ ఏరియా సొంతంమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. రెండు రోజుల పాటు శ్రీరాంపూర్ వేదికగా హోరాహోరీగా సాగిన సింగరేణి కంపెనీ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జీఎం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సింగరేణిలోనే మరే ఇతర ఏరియాలో లేని విధంగా మూడు పెద్ద స్టేడియాలు ఒక్క శ్రీరాంపూర్ పరిధిలోనే ఉండటం గర్వకారణమని, ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ మెన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో శ్రీరాంపూర్ క్రీడాకారులు కె. హర్ష, బి. నరేష్ విజేతలుగా నిలవగా, ఉమెన్స్ విభాగంలో దీప్తి (ఆర్జీ 1,2) సింగిల్స్, దీప్తి-గాయత్రి డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. వెటరన్ సింగిల్స్‌లో శంకరయ్య (భూపాలపల్లి), డబుల్స్‌లో శ్రీరాంపూర్‌కు చెందిన హరినారాయణ-సురేష్ జంట విజయం సాధించారు. ఇక టేబుల్ టెన్నిస్ మెన్ సింగిల్స్‌లో వినోద్ (ఆర్జీ 2), డబుల్స్‌లో శ్రీరాంపూర్‌కు చెందిన కిరణ్ కుమార్-శైలేందర్ టీం విజేతలుగా నిలిచారు. టీటీ ఉమెన్స్ సింగిల్స్‌లో కళ్యాణి (భూపాలపల్లి), డబుల్స్‌లో పద్మావతి-సాధన (మణుగూరు/ఇల్లందు), వెటరన్ సింగిల్స్‌లో ఈశ్వరాచారి (శ్రీరాంపూర్), డబుల్స్‌లో చాంద్ పాషా-శ్రీధర్ జోడీ ప్రథమ స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ప్రెసిడెంట్ మహేష్, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, సింగరేణి స్పోర్ట్స్ మేనేజర్ సునీల్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ హానరరీ సెక్రటరీ సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సురేష్, వివిధ ఏరియాల క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment