దేశంలో బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

  • జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్
  • మంచిర్యాలలో 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతుల విడుదల.. ఈనెల 7న పోరాటం

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దేశంలో బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ లో బుధవారం ఈనెల ఏడో తేదీన చేపట్టనున్న 24 గంటల నిరవధిక దీక్షకు సంబంధించిన గోడ ప్రతులను సమితి నాయకులతో కలిసి విడుదల చేశారు. గత 40 ఏళ్లుగా బీసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు సాగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశాయని మండిపడ్డారు. బీసీల అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని గుమ్ముల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు కూడా బీసీల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. హక్కుల సాధన కోసమే ఈనెల 7న నిరవధిక దీక్షకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. జిల్లాలోని బీసీ కుల సంఘాలు, బీసీ వాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం సాగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. బీసీ సమాజం ఏకతాటిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గజ్జెల్లి వెంకటయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ, నాయకులు వేముల అశోక్, మంచెర్ల సదానందం, చెలిమెల అంజయ్య, రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment