🔴 బీఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి
🟢 జీఎం మునిగంటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: దసరా ఉత్సవాల సందర్భంగా సింగరేణిలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే శ్రీరాంపూర్ ఏరియాలోనూ రామ్‌లీలా కార్యక్రమాన్ని యాజమాన్యమే అధికారికంగా నిర్వహించాలని బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌ను కలిసి బీఎంఎస్ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాతాడి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జరుపుకుంటారని, శ్రీరాంపూర్ పరిధిలోని కార్మికుల కోసం రామ్‌లీలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రగతి స్టేడియాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎర్రం తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మిట్ట మధుకర్, ఎస్సార్పీ-3 పిట్ సెక్రటరీ భుంపల్లి రమేష్, ఆర్‌కే-5 పిట్ సెక్రటరీ కుమ్మరి చంద్రశేఖర్, ఆర్‌కే-7 పిట్ సెక్రటరీ కుంట రాజు, పిట్ కో-ఆర్డినేటర్ కంపెల్లి తిరుపతి, ఎస్సార్పీ-3 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







