నిస్వార్థ ప్రజానేత కామ్రేడ్ గుండా మల్లేష్ సేవలు చిరస్మరణీయం

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు
శ్రీరాంపూర్ సీపీఐ కార్యాలయంలో 6వ వర్ధంతి వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం నిరంతరం పోరాడిన నిస్వార్థ ప్రజానేత కామ్రేడ్ గుండా మల్లేష్ సేవలు చిరస్మరణీయమని ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కొనియాడారు. మంగళవారం కామ్రేడ్ గుండా మల్లేష్ 6వ వర్ధంతి సందర్భంగా శ్రీరాంపూర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. గుండా మల్లేష్ తన జీవితాన్ని పేద ప్రజల సంక్షేమం, కార్మికుల హక్కుల సాధనకే అంకితం చేశారని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ అణగారిన వర్గాలకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవ, పోరాట పటిమ ప్రజల హృదయాల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని అన్నారు. నేటి తరానికి ఆయన పోరాట జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం కార్మికులు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గుండా మల్లేష్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బడుగుల హక్కుల కోసం పనిచేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న, నాయకులు కొత్తపల్లి మహేష్, బొడ్డు లచ్చన్న, నూకల రాజయ్య, మూడ సుధాకర్, సర్వ శ్రీనివాస్, పుల్లా రమేష్, రౌతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment