🟠 ఎస్ అండ్ పీసీ విభాగం బీఎంఎస్ నూతన పిట్ కమిటీ ఎన్నిక.. పిట్ సెక్రటరీగా కొమ్మ బాపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కార్ప్స్ (ఎస్ అండ్ పీసీ) విభాగం వారి పాత్ర ఎంతో కీలకమని, క్రమశిక్షణ, అంకితభావానికి వారు ప్రతీక అని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) శ్రీరాంపూర్
ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ అండ్ పీసీ విభాగానికి సంబంధించిన నూతన బీఎంఎస్ పిట్ కమిటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ బీఎంఎస్ యూనియన్ను మరింత బలోపేతం చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ బైరి హనుమాన్ గౌడ్‌కు నూతన కమిటీ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతన పిట్ సెక్రటరీతో పాటు కార్యవర్గ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ అండ్ పీసీ విభాగం పిట్ సెక్రటరీగా కొమ్మ బాపు (సీనియర్ సెక్యూరిటీ గార్డ్), అసిస్టెంట్ పిట్ సెక్రటరీగా అష్టకాల శ్రీధర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అప్పాల రవీందర్ (సీనియర్ సెక్యూరిటీ గార్డ్) నియమితులయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా పబ్బతి మల్లేష్ (సీనియర్ సెక్యూరిటీ గార్డ్), ఆకుతోట బాలకృష్ణ, ఒడ్డె తిరుపతి, బొప్ప లక్ష్మణ్.. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మేరుగు శ్రీనివాస్, సుంకరి మొండి, జీకే స్వామి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు జెల్ల తిరుపతి, కనవెన సాగర్, బుర్ర అరుణ్ కుమార్ గౌడ్, గూడ శ్రీకాంత్, ఐలి శ్రీనివాస్, బొద్దుల ఫణికుమార్, సంగెం నర్సింహారావు, తీర్తాల సదానందం, దాసరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ అండ్ పీసీ నూతన బీఎంఎస్ కమిటీ నియామక పత్రాన్ని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ బైరి హనుమాన్ గౌడ్‌కు అందజేస్తున్న ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి తదితరులు.








