పారదర్శకంగా ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగుల క్వార్టర్స్ కౌన్సెలింగ్

461 ఖాళీ క్వార్టర్లకుగాను 74 మందికి అలాట్‌మెంట్

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగుల కోసం గురువారం ఛేంజ్ ఆఫ్ క్వార్టర్స్ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఇప్పటికే క్వార్టర్లు కలిగి ఉండి గ్రౌండ్ ఫ్లోర్ లేదా మెరుగైన వసతులు ఉన్న క్వార్టర్లను ఎంచుకునే వెసులుబాటు కోసం ఈ కౌన్సెలింగ్ చేపట్టారు. శ్రీరాంపూర్ పరిధిలోని నస్పూర్, గోదావరి కాలనీ, ఆర్కే-6 కాలనీ, టీచర్స్ కాలనీ, సీసీసీ టౌన్‌షిప్, కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే-8 కాలనీలలో ఖాళీగా ఉన్న మొత్తం 461 క్వార్టర్ల కోసం స్థానిక ప్రగతి స్టేడియం సీఈఆర్ క్లబ్‌లో ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 376 మంది కార్మికులు దరఖాస్తు చేసుకోగా, 111 మంది హాజరయ్యారు. వారిలో 74 మంది ఉద్యోగులు సీనియారిటీ ఆధారంగా తమకు నచ్చిన క్వార్టర్లను ఎంచుకున్నారు. ఎస్వోటు జీఎం బి. కృష్ణ ప్రసాద్, డీజీఎం (పర్సనల్) డాక్టర్ ఎస్. అనిల్ కుమార్, ఈఈ (సివిల్) అఖిల్ నాయక్, సీనియర్ పీవో ప్రశాంత్, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ల ఆధ్వర్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment