బాధితుడికి సెల్‌ఫోన్ అందజేసిన సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించడంలో సీఈఐఆర్ పోర్టల్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని సీసీసీ నస్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్సై) ఎండీ. తహసీనుద్దీన్ తెలిపారు. నస్పూర్ పట్టణం న్యూ నాగార్జున కాలనీకి చెందిన అంచే కృష్ణచందర్ గత నెల స్థానిక మార్కెట్లో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. బాధితుడు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదును నమోదు చేశారు. ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్ పర్యవేక్షణలో సీసీటీఎన్ఎస్ కానిస్టేబుల్ బ్రహ్మచారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిరంతరం ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ట్రాక్ చేశారు. పోయిన మొబైల్లో వేరే వ్యక్తి కొత్త సిమ్ వేసి మాట్లాడుతున్న విషయాన్ని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఆ వ్యక్తి చిరునామా మందమర్రిగా నిర్ధారించుకున్న పోలీసులు.. వెంటనే అతనితో మాట్లాడి ఫోన్‌ను పోలీస్ స్టేషన్‌కు తెప్పించారు. అనంతరం గురువారం ఆ మొబైల్‌ను బాధితుడు అంచే కృష్ణచందర్ను స్టేషన్‌కు పిలిపించి భద్రంగా అప్పగించారు. స్వల్ప వ్యవధిలోనే సాంకేతికతతో ఫోన్‌ను గుర్తించి అప్పగించిన ఎస్సై, కానిస్టేబుల్ బ్రహ్మచారికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.




