సింగరేణి ఉద్యానవన మహిళా కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మేయర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యంమని మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఉద్యానవన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మహిళా కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మేయర్ ధర్ని మధుకర్ ను కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ఉద్యానవన విభాగంలో పనిచేస్తున్న మహిళల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి మహిళా ఉద్యోగి ఆత్మగౌరవంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు తమ పనితీరుతో సింగరేణి ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని మేయర్ మెచ్చుకున్నారు. వారి సంక్షేమానికి నగర పాలక సంస్థ తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పనాస రవీందర్, సాదినేని సదానందం, పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.




ఎండల తీవ్రత దృష్ట్యా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. డంప్ యార్డ్ వద్ద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. విపత్తు సమయంలో సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంలో సహకరించిన ఫైర్ సిబ్బందిని అభినందించారు. డంప్ యార్డ్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన మేయర్ ధర్ని మధుకర్ ను స్థానిక ప్రజలు ప్రశంసించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సిబ్బందితో కలిసి మేయర్ తీసుకున్న చర్యలు స్థానికులకు ఊరటనిచ్చాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుట్ట యశోద, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.