కలెక్టర్ కుమార్ దీపక్ కు విగ్రహ సాధన కమిటీ వినతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ విగ్రహ సాధన కమిటీ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్తగా భారతదేశానికి జగజ్జీవన్ రామ్ అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన స్మారకార్థం జిల్లా కేంద్రంలో విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. జగజ్జీవన్ రామ్ ఆశయాలను భావితరాలకు అందించడానికి విగ్రహ ఏర్పాటు దోహదపడుతుందని సభ్యులు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించి తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ సాధన కమిటీ సభ్యులు చంద్రగిరి నరేష్, దాసరి విజయ్ సాగర్, తోటపల్లి మహేందర్, లింగంపెల్లి నరేష్, నునవత్ భీమ్యా నాయక్, కోండ్ర ఉదయ్ కిరణ్, గుంపుల స్వామి తదితరులు పాల్గొన్నారు.



