- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
- నారి శక్తి వందన్ బిల్లును అడ్డుకోవడంపై బీజేపీ ధ్వజం
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: నారి శక్తి వందన్ బిల్లును లోక్ సభలో అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం మహిళా ద్రోహం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ విమర్శించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 33 శాతం మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకించడం వల్ల రాష్ట్రంలో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు కేంద్రం ఇస్తున్న హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. గత 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటూనే ఉందని రఘునాథ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ వల్ల కేవలం హైదరాబాద్‌లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. దీనివల్ల తెలంగాణలోని మిగతా జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. మహిళా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో మహిళలు బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ముకేష్ గౌడ్, కార్పొరేటర్ అనిత, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆంజనేయులు, స్వాతి, సుజాత, స్వప్న, రజిత, సరుతారెడ్డి, జయరాం రావు,రాజు కుమార్, స్వామి రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 34 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఈ అరుదైన వేడుకను నిర్వహించారు. సమ్మేళనం ప్రారంభానికి ముందు శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ క్రీడా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 మంది క్రీడాకారులు, అధికారులు, కళాకారులు శోభాయాత్రగా ప్రగతి మైదానానికి చేరుకున్నారు. అక్కడ క్రీడా లోగోను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక సావనీర్‌ను విడుదల చేశారు. సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం జరగడం మరుపురాని అనుభూతి అని అతిథులు పేర్కొన్నారు. సింగరేణి సంస్థ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని ఎం శ్రీనివాస్ కొనియాడారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రగతి స్టేడియం ఎన్నో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన వేలాది మంది క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగారు. మంచి ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకమని ఆయన వివరించారు. క్రీడాకారులు, కళాకారుల ప్రతిభను గుర్తించి వారిని జ్ఞాపికలతో సన్మానించారు. వేడుకలో భాగంగా విద్యార్థులు, సింగరేణి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ అలాయ్ బలాయ్ ద్వారా పలకరించుకున్నారు. పాత జ్ఞాపకాలను పంచుకుంటూ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యక్షులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కో కన్వీనర్ ఇసంపెల్లి, రాంచందర్, గోవర్దన్‌రెడ్డిల ఆద్వర్యంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, ఎస్‌ఓటూజీఎం ఎన్ సత్యనారాయణ, రిటైర్డ్ జీఎంలు ఈవీ పురుషోత్తం, పాండురంగారావు, టీపీఏ ప్రేంకుమార్, రామకృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ హన్మంతరెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రఘునాధరెడ్డి, కార్పొరేటర్ వేల్పుల రవీందర్, సీనియర్ క్రీడాకారులు పుల్లయ్య, జూపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.