ప్రత్యేక పూజల్లో పాల్గొని, అన్నదానం చేసిన మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యుడు నూకల రమేష్
నస్పూర్, ఆర్.కె న్యూస్: గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కొత్త రోడ్డులో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్‌లతో కలిసి ఆలయాన్ని సందర్శించి సాయిబాబా వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో మేయర్, నాయకులు పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. గురు పౌర్ణిమ అనేది ఆధ్యాత్మికతకు, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. సాయిబాబా దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చిలుక మల్లేష్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.







