మంచిర్యాలలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి

కౌన్సిల్‌లో అధికారిక తీర్మానం చేయాలని మేయర్‌కు బీసీ సమాజ్ వినతిపత్రం
పదేళ్ల విజ్ఞప్తిని సానుకూలంగా పరిష్కరించాలి: నరెడ్ల శ్రీనివాస్

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించి, అనుమతులు మంజూరు చేస్తూ రాబోయే కౌన్సిల్ సమావేశంలో అధికారిక తీర్మానం చేయాలి” అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కోరారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్‌కు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలు భావితరాలకు నిరంతరం గుర్తుండేలా మంచిర్యాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లుగా మున్సిపాలిటీ, ప్రస్తుత కార్పొరేషన్ పాలకవర్గాలకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారిక తీర్మానం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూలే విగ్రహ ప్రతిష్ఠాపన అనేది సామాజిక న్యాయానికి, బహుజన ఆత్మగౌరవానికి ఇచ్చే గౌరవమని పేర్కొంటూ, మేయర్ ప్రత్యేక చొరవ తీసుకుని వచ్చే కౌన్సిల్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకుడు వెల్ది సుదర్శన్, ది విశ్వకర్మ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజాచారి, బీసీ సమాజ్ జిల్లా నాయకులు కర్ణకంటి రవీందర్, బియ్యాల సత్తయ్య, జక్కం రవీందర్, పెద్దపల్లి సూరయ్య, సంద ప్రభాకర్, మాడిశెట్టి మహేష్, కొండు రాజు, చల్ల విజయ్ కుమార్, తాటిపాముల సమ్మయ్య, వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్, ముదెపల్లి రమేష్, వేముల నాగరాజు, పల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment