పక్షులను కాపాడితేనే ప్రకృతిని కాపాడినట్లవుతుంది: గుండేటి యోగేశ్వర్

నస్పూర్ లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం: పర్యావరణ హిత జీవన విధానంపై అవగాహన

నస్పూర్, ఆర్.కె న్యూస్: పక్షులను కాపాడితేనే మనం ప్రకృతిని కాపాడినట్లవుతుందని పర్యావరణవేత్త, ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని కలెక్టరేట్ రోడ్డులోని ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఆవరణలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతరించిపోతున్న పిచ్చుకల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. భూగోళం మీద ఉన్న ప్రతి పౌరుడు పర్యావరణానికి నష్టం కలిగించని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో పిచ్చుకల కోసం అనువైన వాతావరణం కల్పించాలని యోగేశ్వర్ కోరారు. వేసవి కాలంలో పిచ్చుకల దాహం తీర్చేందుకు ఇంటి గోడలపై, ఖాళీ ప్రదేశాల్లో మట్టి పాత్రల్లో నీళ్లు, గింజలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక చెట్టు నాటితే అనేక పక్షులకు నివాసం కల్పించినట్లవుతుందని వివరించారు. ఈ సందర్భంగా వెదురు, కర్ర, గడ్డి, మట్టితో చేసిన పిచ్చుకల గూళ్లను ప్రదర్శించారు. పక్షుల కోసం ఏర్పాటు చేసిన మట్టి పాత్రలు, ఆహారమైన జొన్న గొలుసులు, ధాన్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పిచ్చుకల సంరక్షణకు సంబంధించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మంచిర్యాల నగర పాలక సంస్థ 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ పిచ్చుకలు ఉన్న చోట పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. పిచ్చుకలు హానికారక క్రిమి కీటకాలను తింటూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ మాట్లాడుతూ పిచ్చుకల రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. వేసవిలో వాటికి తాగునీరు, ఆహారం అందించాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణను శాలువాతో సన్మానించి పచ్చని మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా కార్యాలయ ఏఓ పొన్న మల్లయ్య, న్యాయవాదులు అలేఖ్య, నటేశ్వర్ పాల్గొన్నారు. పశు వైద్యాధికారి డాక్టర్ గుల్లపల్లి శంకర్ లింగం, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కిష్టయ్య, సినీ గేయ రచయిత అక్కల చంద్రమౌళి, సంస్థ సభ్యులు మహేందర్, వంశీ, స్వర్ణ, శోభ, సునీత, రాధ, శరత్ చంద్ర, రాజశేఖర్, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment