పట్టుదలతో చదివితేనే ఉన్నత పదవులు దక్కుతాయి

  • బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
  • జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ఏకారి లిఖితకు ఘన సన్మానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: పట్టుదలతో చదివితేనే అత్యున్నత పదవులు దక్కుతాయని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ అరుణక్కనగర్‌కు చెందిన ఏకారి లిఖిత ఇటీవల వెలువడిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం విజిత్ కుమార్ నస్పూర్ పట్టణ నాయకులతో కలిసి లిఖిత నివాసానికి వెళ్లారు. ఆమెను శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో శ్రమించి న్యాయశాఖలో ఉన్నత కొలువు సాధించడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. లిఖిత సాధించిన విజయం స్థానిక యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని విజిత్ కుమార్ అన్నారు. లక్ష్యసాధన కోసం కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని ఈ విజయం నిరూపించిందని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, నాయకులు వంగ తిరుపతి, సిద్ధం తిరుపతి, రాజేశ్వర్ రెడ్డి, పెట్టం నరేష్, శ్రవణ్, నాగేష్, సంపత్, రమేష్, అఖిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment