నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) గా నియమితులైన వడాల రాములును బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా నాయకులు శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించాలని కోరారు. జిల్లాలోని రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ పాలనను ప్రజలకు చేరువ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, జిల్లా ఈసీ మెంబర్ సెట్టి ప్రవళిక, ఎండీ మాతిన్ ఖాన్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, బామ్ సేఫ్ జిల్లా కన్వీనర్ సెట్టి శంకరయ్య, అడ్వకేట్ నటేశ్వర్ పాల్గొన్నారు.
3







