రవీంద్రభారతిలో ల్యాప్టాప్, స్వర్ణ పతకం అందుకున్న రేవాన్ష్ సాయి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని నారాయణ హైస్కూల్ విద్యార్థి కడారి రేవాన్ష్ సాయి జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. సీఎన్ఏపీఎస్ (CNAPS) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఎస్ఎంఓ-ఏఐఆర్ (ISMO-AIR) పరీక్షలో ఈ ఒకటో తరగతి విద్యార్థి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి ఏప్రిల్ 21న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బంగారు పతకంతో పాటు ల్యాప్టాప్ బహుకరించారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జనరల్ మేనేజర్ గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణ రెడ్డి, ఏజీఎం చైతన్య రావు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని అభినందించారు. విద్యార్థుల మేధో వికాసానికి, భవిష్యత్తు అభివృద్ధికి ఇలాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి పేర్కొన్నారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో ఈ చాంప్స్ ఆర్ అండ్ డి ప్రతినిధి స్వాతి లక్ష్మి, కో ఆర్డినేటర్ శ్వేత, జోనల్ అనాలసిస్ట్ రాజేందర్ కుమ్మరి, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, అకాడమిక్ డీన్ వెంకటస్వామి, ఏఓ కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన రేవాన్ష్ సాయిని పలువురు అభినందించారు.







