సోన్, ఆర్.కె న్యూస్: రైతులు గుళికల రూపంలో గల యూరియా వాడకం తగ్గించి నానో యూరియాను రైతులు వినియోగించాలని నిర్మల్ జిల్లా సోన్ మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామంలో గురువారం రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. నానో యూరియా వల్ల పర్యావరణం , నేల కాలుష్యం కాకుండా ఉండి స్వచ్ఛమైన పంట దిగుబడులు పొందవచ్చని అన్నారు. అధిక యూరియా వాడకం వల్ల కలుగు అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ అశోక్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
1







