ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందే వరకు కృషి చేస్తాం

నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు అందే వరకు స్థానిక శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కృషి చేస్తామని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కిస్టాపురం మంగ-మల్లేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్ వెల్లడించారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులు నూతన ఇల్లు సమకూరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్‌తో పాటు స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య వేణు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధికారి, హౌసింగ్ బోర్డు అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment