ఉత్పత్తి కంటే రక్షణే ముఖ్యం… రక్షణ లేని ఉత్పత్తి వ్యర్థం

  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • ఎక్స్‌ప్లోజివ్స్ వినియోగం, భద్రతపై గనుల అధికారులతో సమీక్ష సమావేశం

నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉత్పత్తి కంటే రక్షణే ముఖ్యం… రక్షణ లేని ఉత్పత్తి వ్యర్థం అని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎక్స్‌ప్లోజివ్స్ వినియోగం, ప్రమాదాల నివారణపై ఏరియాలోని అన్ని గనుల ఏజెంట్లు, ప్రాజెక్ట్ అధికారులు, మేనేజర్లతో మంగళవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పని ప్రదేశాలలో ఉద్యోగుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గనుల్లో రూఫ్ ఫాల్, సైడ్ ఫాల్, హాలేజ్ వంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎక్స్‌ప్లోజివ్స్, ఎలక్ట్రికల్ ప్రమాదాల నివారణలో అత్యంత అప్రమత్తత అవసరమని, వీటి విషయంలో డీజీఎంఎస్ నిబంధనల నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవని జీఎం హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ డిటోనేటర్ల సమర్థవంతమైన వినియోగంపై షాట్ ఫైరర్లు, మైనింగ్ సర్దార్లు, సూపర్‌వైజర్లకు గనుల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గనులకు సరఫరా అయ్యే ఎక్స్‌ప్లోజివ్స్ నాణ్యతను పరిశీలించి, లోపాలు లేదా డ్యామేజ్ ఉన్నవాటిని తక్షణమే సప్లయర్లకు తిప్పి పంపాలని స్పష్టం చేశారు. రోజూ ఫీల్డ్ సిబ్బంది నుంచి నివేదికలు తీసుకుంటూ మిస్‌ఫైర్, నో బ్లాస్ట్ వంటి సమస్యలు తలెత్తకుండా సరఫరాదారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అవర్ ఎయిమ్ జీరో హార్మ్ లక్ష్యంగా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, ఏజీఎం (ఫైనాన్స్) శ్రీధర్, ఐకే ఓసీ పీవో ఏవీ రెడ్డి, ఆర్.కె గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, ఎస్‌ఆర్‌పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, డీజీఎం (సేఫ్టీ) విజయ్ కుమార్, డీజీఎం (స్టోర్స్) మల్లయ్య, వివిధ గనుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment