నస్పూర్ టీఎన్జీవో కాలనీలో వైభవంగా బంకమట్టి గణపతి ప్రతిష్ఠాపన

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలి: గడియారం శ్రీహరి

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని టీఎన్జీవో కాలనీలో శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతిని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో వైభవంగా ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, వినాయక చవితి పర్వదినం వేళ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రకృతి రక్షించబడుతుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ), రసాయన రంగుల విగ్రహాల వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ విపరీత వినియోగం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, పూజా కార్యక్రమాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి స్టీల్ పాత్రలు, ఆకు దొన్నెలు వినియోగించాలని సూచించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షులు తిరుపతి, ఎన్. సత్యనారాయణ, సొసైటీ నాయకులు పుప్పాల హనుమంతరావు, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బొడ్డు శ్రావణ్ కుమార్, భూముల రామ్మోహన్, సైండ్ల మొండయ్య, నాగేశ్వరరావు, తిరుపతి రెడ్డి, సునీత, లక్ష్మీరాజయ్య, మల్లికార్జున్, కాలనీ మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment