సింగరేణికి రావాల్సిన రూ. 59 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

నెలాఖరులోగా స్పందించకుంటే బొగ్గు సరఫరా నిలిపివేత: వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరిక
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్టడి విజయవంతం

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణికి రావాల్సిన బకాయిలను విడుదల చేయడం ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదు.. అది ప్రభుత్వ బాధ్యత అని సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ-ఎస్‌సీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారురూ. 59 వేల కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైంది. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ల నుంచి సుమారు 1,450 మంది కార్మికులు, కార్మిక నాయకులు హైదరాబాద్‌కు తరలివచ్చి విద్యుత్ సౌధ ముట్టడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యూసఫ్, ప్రధాన కార్యదర్శి నరసింహ, వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.26 వేల కోట్లుగా ఉన్న బకాయిలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 59 వేల కోట్లకు చేరడం ఆందోళనకరమన్నారు. గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. వేల కోట్ల నిధులు పేరుకుపోవడం వల్ల సంస్థ ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఈ నెలాఖరులోగా బకాయిల చెల్లింపుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే జెన్‌కో, ట్రాన్స్‌కోలకు బొగ్గు సరఫరాను నిలిపివేసే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లయ్య, సెంట్రల్ సెక్రటరీ వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు బాజీ సైదా, మోటపలుకుల రమేష్, ఎమ్మార్సీ రెడ్డి, రాంగోపాల్, శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, సుధాకర్, నజీర్, రంగు శ్రీనివాస్, గంధం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment